ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు కార్యాచరణ
NEWS Sep 02,2024 01:02 pm
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీల్లో రోడ్లు,డ్రైనేజీ పనులు చేపట్టేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన 10 కోట్ల రూపాయలతో ఎస్సీ కాలనీల్లో పనులు పనులు చేపట్టాలని కోరారు.