రోడ్లను పరిశీలించిన అరకు ఎమ్మెల్యే
NEWS Sep 02,2024 01:04 pm
అనంతగిరి మండలం కొండిబ గ్రామంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం సందర్శించారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వలస మామిడి కపాతవలస, అంబటి మామిడి రజిని వలస గ్రామాల రహదారులను ఎమ్మెల్యే పరిశీలించారు. రోడ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.