ఘనంగా వైయస్ఆర్ వర్ధంతి
NEWS Sep 02,2024 12:45 pm
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో YSR చిత్ర పటానికి సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా YSR పెట్టిన పథకాల వల్ల లక్షల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియంబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్తు ఇలా ఎన్నో పథకాలు పెట్టిన ఘనత YSRదే అని అన్నారు.