వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
NEWS Sep 02,2024 12:38 pm
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువు అలుగు దుంకి ఉదృతంగా ప్రవహిస్తున్న వరదని, సనుగుల గ్రామంలో వరద ఉధృతికి కోతకు గురైన రోడ్డును,పొలాలను పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు చేశారు. వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు