డ్రోన్లతో ఫుడ్ - సీఎం పరిశీలన
NEWS Sep 02,2024 12:30 pm
విజయవాడ వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం సవాల్‌గా మారడంతో డ్రోన్లను రంగంలోకి దించాలని నిర్ణయించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ బాస్కెట్లు తీసుకెళ్లే విధానాన్ని సీఎం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించవచ్చని, ఒక డ్రోన్ సాయంతో 10 కిలోల వరకు ఆహారం, ఔషధాలు, తాగునీరు పంపవచ్చని అధికారులు తెలిపారు. వాహనాలు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సహాయ చర్యలు చేపట్టడం సులువు అని వారు తెలిపారు. వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.