ఇంజనీరింగ్ అధికారులు పర్యటన
NEWS Sep 02,2024 12:36 pm
బూర్జ మండలం అల్లెన, జే. బి పురం, బూర్జ గ్రామాల పరిధిలో నాగావళి నదీ తీర ప్రాంతాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. కరకట్టడాల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో గ్రామస్తులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. EE హెచ్ మన్మధరావు, DEE ఎ.రమేష్, AEE లు కార్తీక్, యశ్వంత్, చంద్రశేఖర్, స్థానిక నాయకులు వాడాడ రాంబాబు, గోవిందరావు పాల్గొన్నారు.