కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తి సింహాద్రి కాలనికి చెందిన ఓదెల గౌరయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. కాగ డివిజన్ కు చెందిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి సోమవారం మృతుడి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. తమ వంతు సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవా శ్రీను రౌతు శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.