రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే రేగం
NEWS Sep 02,2024 12:31 pm
అనంతగిరి: అనంతగిరి మండలం కొండిబ పంచాయితీలో భారీ వర్షాలకు దెబ్బతిన్న వలసమామిడి, కపాతవలస, అంబటి మామిడి తదితర గ్రామాల రోడ్లను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పరిశీలించారు. ఆయా గ్రామస్తులు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యను ఎమ్మెల్యే కు తెలుపుకున్నారు. ప్రభుత్వం, ఉన్నత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే రేగం బదులిచ్చారు.