మొక్కలు నాటి పవన్‌కు విషెస్
NEWS Sep 02,2024 12:41 pm
అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం,బుచ్చింపేట గ్రామపంచాయతీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని బుచ్చింపేట గ్రామపంచాయతీ పరిధిలో టిడిపి సీనియర్ నాయకులు ఉలబాల పోతురాజు నాయుడు, జన సైనికులు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పోతురాజు నాయుడు పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పచ్చదనంపై గ్రామస్తులు అందరికీ అవగాహన కల్గి ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.