ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
NEWS Sep 02,2024 12:39 pm
డుంబ్రిగూడ మండల కేంద్రంలో వైయస్సార్ 15వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ మేరకు ఎంపిపి బాకా ఈశ్వరీ, జడ్పీటీసీ చట్టారి జానకమ్మ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహారు వైయస్సార్ అంటూ నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో YSRCP మండల అధ్యక్షులు మల్లేశ్వరరావు, వైస్ ఎంపిపి ఆనంద్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిముడు హరి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.