డుంబ్రిగూడ మండలంలోని కించమండ పంచాయతీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దనేశ్వ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి బంగురు రామదాసు పాల్గొని ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పవన్ కళ్యాణ్ పాటలతో సందడి చేశారు.