ప్రయాణికులకు అలెర్ట్ - పలు రైళ్లు రద్దు
NEWS Sep 02,2024 09:46 am
ఉత్తరం- దక్షిణాది రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గం.. విజయవాడ, ఖమ్మం. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ రెండు రూట్లూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైలు పట్టాలు ధ్వంసం అయ్యాయి. ఓవర్ హెడ్ లైన్ మొత్తం దెబ్బతిన్నది. పట్టాల కింద భూమి కొట్టుకుపోయింది. పట్టాలు పలుచోట్ల గాల్లో వేలాడే పరిస్థితి నెలకొంది. దక్షిణమధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6 రైళ్లను రద్దు చేసింది. 10 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తాజా బులిటెన్ విడుదల చేశారు.