పెదపల్లి జిల్లాలోని వరదల నేపథ్యంలో చెరువులు,కుంటలు ఇతర నీటి వనరులలో నీటి నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వరదలు, నీటి వనరుల నిర్వహణ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.