భిమదేవరపల్లి మండలం భద్రకాలీ సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి 27రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ సందర్భంగా స్వామి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్షత్ర మాల విరమణ సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయం నుండి ఇరుముడితో ఇతర మాలాదర స్వాములతో కాలినడకన స్వామి వారి నామస్మరణ చేస్తూ సాహసోపేతంగా వర్షం చిరుజల్లుల మధ్య కొత్త కొండగుట్టపైకి ఎక్కి కుటుంబ సభ్యులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ తో కలిసి శివలింగాన్ని దర్శించుకున్నారు