ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానం
NEWS Sep 02,2024 08:29 am
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు తక్షణమే సహయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోడీని కోరారు. వర్షాలు, వరదల వల్ల సంభవించిన అపార నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.