మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతపై విద్యార్థులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.