తెలంగాణకు భారీ వర్షాలు లేవు
NEWS Sep 02,2024 08:06 am
తెలంగాణ రాష్ట్రానికి కాస్త గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలోని వాయుగుండం పూర్తిగా బలహీనపడుతుందని.. అల్పపీడనంగా మారనుందని, ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు పడవని వివరించింది. కాకపోతే.. సెప్టెంబర్ 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.