సహాయక చర్యలపై సీఎం సమీక్ష
NEWS Sep 02,2024 08:09 am
భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.