పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం
NEWS Sep 02,2024 08:02 am
ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరదలకు ప్రజలు అల్లకల్లోలం అవుతుండటంతో మంత్రి పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రూరల్ మండలంలో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీల్లో పొంగులేటి బైక్పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంత్రి బైక్పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై చికిత్స అందించారు.