ఏపీ, తెలంగాణలను ఆదుకుంటాం
NEWS Sep 02,2024 07:56 am
గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. ప్రజాజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు.