CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
NEWS Sep 01,2024 06:16 pm
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. పలు జిల్లాల్లో భారీ వర్షంతో వాటిల్లిన నష్టాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని సీఎంకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని తెలిపారు.