వాగులో కొట్టుకుపోయిన గొర్రెలు
NEWS Sep 01,2024 05:41 pm
జనగామ జిల్లాలో 100 గొర్రెలు వాగులో కొట్టుకు పోయాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో దేవరుప్పుల మండలం కడవెండి వాగు సమీపంలో గొర్రెల కాపరులు చంద్రయ్య, అంకుష్ వాగు మధ్య గట్టుపై గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా వాగు ఉదృతం అవ్వడంతో గొర్రెలని ఓడ్డుకు చేర్చే ప్రయత్నం చేయగా వాగునీరు వారినీ చుట్టూ ముట్టేయడంతో వాగులో చిక్కుకుపోయారు. గొర్రెల కాపరులను గ్రామస్తులు కాపాడగా 100 గొర్రెలు వాగులోని కొట్టుకుపోయాయి. కళ్ళ ముందే గొర్రెలు కొట్టుకుపోవడాన్ని చూసిన చంద్రయ్య అంకుష్ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.