ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 01,2024 05:42 pm
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పలు వాగులు, కాలువలు ప్రవహిస్తుండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శిరీషాదేవి కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలను దాట వద్దని కోరారు. కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని కోరారు.