భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ జారీ
NEWS Sep 01,2024 05:45 pm
హైదరాబాద్ నగరంలో నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఈ క్రమంలో నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసరమైతే 9000113667 నెంబర్‌ల ద్వారా సంప్రదించాలని తెలిపారు