పిఠాపురంకు 16 వేల పండ్ల మొక్కలు
NEWS Sep 01,2024 05:46 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కడియపులంక చిరు సేవాసమితి అధ్యక్షుడు గడ్డం శివ తన 40 మంది సేవాదళం ఆద్వర్యంలో 16 వేల ఉసిరి, నేరేడు, మామిడి వంటి పలు వివిధ పండ్ల జాతి మొక్కలను ఆరు లారీలలో ఆదివారం పిఠాపురం తరలించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇంటికొక మొక్క పంపిణీ చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో నాటనున్నారు.