బోటులో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు
NEWS Sep 01,2024 02:56 pm
కుండపోత వర్షాలతో విజయవాడ నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడొద్దని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను చూసి చేతులూపుతున్న వరద బాధితులను ఉద్దేశించి.. మీరేమీ బాధపడొద్దు.. అన్నీ నేను చూసుకుంటాను.. అంటూ సంజ్ఞల ద్వారా స్పష్టం చేశారు.