మత్తడి దూకుతున్న నర్మాల ఎగువ మానేరు
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
NEWS Sep 01,2024 02:58 pm
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నర్మాల ఎగువ మానేరు నిండుకుండలా మారి మత్తడి దూకుతుంది.రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచ,మెదక్ జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా వరదనీరు భారీగా రావడంతో ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 31అడుగులకు గానూ 31అడుగులకు చేరి మత్తడి దూకుతున్నది.అధికారులను వివరణ కోరగా ఎగువ మానేరు దిగువన ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు తెలిపారు.