సమస్యల పరిష్కారానికి మాజీమంత్రికి వినతి
NEWS Sep 01,2024 02:59 pm
అరకు: తమ సమస్యలను ప్రభుత్వం ధృష్టికి తీసుకువెళ్లి పరీష్కారానికి కృషిచేయాలని టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షుల, మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు గ్రేడ్-5 సెక్రటరీలు వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రేడ్-5 సెక్రటరీలను మైదాన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తే కుటుంబాలు ఇబ్బందులు పడతాయి కావున గిరిజన ప్రాంతంలోనే కొనసాగేలా చూడాలన్నారు. గ్రేడ్-4 కి ప్రమోషన్ కల్పించాలన్నారు. మాజీమంత్రి శ్రావణ్ స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం ధృష్టికి తీసుకువెల్తానన్నారు.