పట్టుబడ్డ 415 కేజీల గంజాయి
NEWS Sep 01,2024 03:02 pm
చింతపల్లి: చింతపల్లి మండలం, చౌటుపల్లి వద్ద వాహన తనిఖీల్లో 415.328 కేజీల గంజాయి, టాటా సఫారీ కారు, ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బైక్ పై వస్తూ సాదారణ తనిఖీలో ఉన్న పోలీసులను చూసి పరారీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకుని విచారించారు. అదే టైంలో అటుగా వస్తున్న టాటా సఫారి కారులోని వారు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా కారు మొరాయించింది. దీంతో వారు కారు వదిలి తప్పించుకున్నారు. కాగా కారులో 20 లక్షలు విలువ చేసే 21 మూటల గంజాయిని పోలీసులు గుర్తించారు.