తెలంగాణ పోలీస్ కీలక సూచనలు
NEWS Sep 01,2024 01:41 pm
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ విభాగం పలు జాగ్రత్తలు చెప్పింది.
▪️ ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, కాలువలు, జలపాతాల వద్దకు వెళ్లకండి.
▪️ చెట్లు, శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండకండి.
▪️ మీ వాహనాల కండిషన్‌ను, వాటి టైర్ల గ్రిప్‌ను చెక్ చేసుకోండి.
▪️ వాహనాలను నిదానంగా నడపండి.
▪️ అత్యవసర సమయాల్లో 100కి కాల్ చేయండి.