గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఎక్కడా లేవని మంత్రి లోకేష్ చెప్పారు. అక్కడ ఏ వీడియోలు బయటికి రాలేదని, నలుగురు మధ్య తలెత్తెన్న వివాదాన్ని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు ఎక్కడ హిడెన్ కెమెరాలను చూపించలేక పోయారని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా తాను ఉన్నాను కాబట్టే ఇంకా ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.