ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 01,2024 01:42 pm
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.ఎక్కడ ఇబ్బంది ఉన్న వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఉదయం నుండి కరీంనగర్ కార్యాలయం నుండి జీహెచ్ఎంసీ, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొం , సిరిసిల్ల జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తం చేశారు.