CPS రద్దు కోసం స్పీకర్ కు వినతి
NEWS Sep 01,2024 01:05 pm
2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అవుతున్న CPS విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరు తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, కోశాధికారి నరేష్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేంద్ర రావు వినతి పత్రం సమ ర్పించారు. హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, సుశీల్ పాల్గొన్నారు. న్యాయం చేస్తే 2.5 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు రుణపడి ఉంటారన్నారు.