సహాయక చర్యల్లో ట్రాఫిక్, మున్సిపల్ సిబ్బంది
NEWS Sep 01,2024 01:43 pm
జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలో కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ వర్క్ షాప్ నుండి వి.పార్క్ ప్రాంతం లో రోడ్లపైకి వరద నీరు రోడ్డున పైకి చేరి ప్రయాణికుల రాక పోకలకు ఇబ్బందులు కలుగడంతో ట్రాఫిక్ సీఐ పర్శ రమేష్ ఆధ్వర్యంలో దాదాపు 2 గంటలు శ్రమించి రోడ్డు పై నిలిచిన నీటిని కచ్చా నాలా కొట్టి నీటిని దిగువకు పంపారు. రోడ్డుపై నిలిచిన నీరు క్లియర్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ..