రేపు అల్లూరి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు
NEWS Sep 01,2024 01:43 pm
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు, ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా విధిగా సెలవు ఇవ్వాలని, ఎటువంటి తరగతులు నిర్వహించరాదని తెలిపారు.