వైసిపి ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్
NEWS Sep 01,2024 05:53 pm
డుంబ్రిగూడ మండలంలోని జముగూడ పాఠశాలలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్సీ కుంభ రవిబాబు రాజకీయం చేయడం సరికాదని, ఆయన మాట్లాడిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి మండల అధ్యక్షుడు సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు..వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గిరిజన ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించుకునేది లేదన్నారు. మాటల్లో చెప్పే ప్రభుత్వం కాదని చేతల్లో చూపించే ప్రభుత్వం అని తెలిపారు.