ధర్మవరంలో జనసేన నేతను కలిసిన టూ టౌన్ సీఐ
NEWS Sep 02,2024 12:48 pm
శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరం పట్టణం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని వారి నివాసంలో పట్టణ టు టౌన్ సీఐ రెడ్డప్ప మర్యాద పుర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఐ రెడ్డప్పకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.