గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
NEWS Sep 01,2024 01:44 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేశ్ స్పష్టం చేశారు. నిందితులు జోగేంద్ర ప్రసాద్, షేక్ వసీంని అరెస్ట్ చేసి వారి నుంచి 1,200 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. యువత గంజాయి వైపు మొగ్గు చూపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డి.ఎస్.పి మహేశ్ పేర్కొన్నారు.