టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ
NEWS Sep 01,2024 05:54 pm
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆదివారం సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య టంగుటూరు పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్లను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును, అలాగే పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా విచారణ జరిపి కోర్టుకి పంపాలని అన్నారు.