నిర్మల్: కడెం ప్రాజెక్ట్ 10గేట్లు ఓపెన్
NEWS Sep 01,2024 10:55 am
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 61,001 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 79,573 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 695.225 అడుగులుగా ఉంది. అధికారులు ప్రాజెక్టు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు.