నాగార్జునసాగర్ కు భారీ వరద
ఎడమ కాలువకు గండి
NEWS Sep 01,2024 09:59 am
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండి పడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాల్వకు భారీ గండి పడి అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి సాగర్ 26 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు.