నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యా ప్తంగా భారీ వర్షం కురుస్తోంది. భీంగల్ రోడ్డుపై చెట్లు నేలకూలాయి. జిల్లాలో పలుచోట్లా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శ్రీరాంసాగర్‌లోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. 35417 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఔట్ ఫ్లో 2710 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091. ప్రస్తుత నీటిమట్టం 1085.60 గా ఉంది. అల్పపీడ నం వల్ల జిల్లాలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.