రేపు పాఠశాలలకు బంద్ ప్రకటించిన కలెక్టర్
NEWS Sep 01,2024 08:59 am
KMR: అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, రెసిడెన్సియల్ విద్యా సంస్థలకు ఈనెల 2 సోమవారం నాడు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ తెలిపారు.