రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు
NEWS Sep 01,2024 08:54 am
HYD: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.