కడప అమ్మాయి ఎర్రనాగుల అమృతవల్లి జాక్ పాట్ కొట్టింది. సియాటెల్‌లోని అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదిం చింది. ఓ ప్రైవేటు కాలేజ్ లో ఇంటర్ పూర్తిచేసిన అమృతవల్లి JEEలో మంచి ర్యాంకు సాధించి దుర్గాపూర్ NITలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఫ్లోరిడా యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో MS చేసింది. అది పూర్తిచేసిన నెలకే అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది.