డుంబ్రిగూడ: భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో ఉన్న గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు డుంబ్రిగూడ మండలంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశమైన చాపరాయి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారుల ఆదేశాల మేరకు జలపాతాన్ని మూయడం జరిగిందని సిబ్బంది తెలియజేశారు.