బాలయ్య అన్ స్టాపబుల్ @ 50
NEWS Sep 01,2024 08:07 am
బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. హీరోగా కొన్నేళ్లు కొనసాగడమే కష్టమైతే... 50 ఏళ్లుగా బాలయ్య హీరోగా కొనసాగుతూనే ఉండటం ఆయన స్టార్‌డమ్‌కు నిదర్శనం. రాజకీయాల్లో సైతం ఓటమి ఎరుగని నేతగా హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. బాలకృష్ణ 50 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. బాలయ్య 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు.