సూర్యాపేట జిల్లా కోదాడలో వాన బీభత్సం సృష్టిస్తోంది. వరద నీటిలో కొట్టుకొచ్చిన కారులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ మున్సిపాలిటీలోని భారతి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న కాలువలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. కారులో ఒకరు చనిపోయాయి ఉన్నారు. గాంధీనగర్ కు చెందిన నాగం రవి మృతుడిగా పోలీసులు గుర్తించారు. నాలాలో ఉన్న కార్లను క్రేన్ సాయంతో బయటకు తీశారు.