రెండో లైను కొరకు బొర్రా గుహలను సందర్శించిన రైల్వే కమిటీ
NEWS Sep 01,2024 01:44 pm
అనంతగిరి: బొర్రా గుహలపై రెండో లైన్ కొరకు రైల్వే శాఖ నియమించిన ఐదుగురు సర్వే కమిటీ సభ్యులు MP తనుజారాణి సమక్షంలో బొర్రా కేవ్స్ ని సందర్శించారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా బొర్రా గుహలు గుర్తింపు పొందాయన్నారు. రెండో లైన్ తో గుహలను కోల్పవలసి ఉంటుంది కావున రెండో లైన్ కొరకు 40మీ దూరం ఎలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎలైన్మెంట్ వలన ఎటువంటి నష్టం గుహలకు జరగదని, సందేహాలకు సర్వే చేయించుకోవచ్చని కమిటీ సభ్యులు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ ఉన్నారు