కూలుతున్న పురాతన కట్టడం
NEWS Sep 01,2024 08:10 am
కరీంనగర్‌లో 49వ డివిజన్ లో 150సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం శిథిలావస్థకు చేరగా రాత్రి కురిసిన వర్షానికి స్లాబ్ పైకప్పు, గోడలు విరిగిపడ్డాయి. కార్పొరేటర్ సర్దార్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్ తో కలిసి పాండురంగ స్వామి దేవాలయాన్ని డిప్యూటీ మేయర్ చల్లస్వరూపరాణి హరిశంకర్ పరిశీలించారు. పురాతన కట్టడం కావడంతో శిథిలావస్థకు చేరడంతో కూలిందని స్థానికులు తెలపగా ఆలయంలోకి ఎవరు కూడా వెళ్లవద్దని, మున్సిపల్ సిబ్బందికి శిధిలాలను తొలగించాలని ఆదేశించారు.